కో-స్టార్స్ పై రకుల్ అభిప్రాయం ఏంటో చూడండి

- September 09, 2018 , by Maagulf
కో-స్టార్స్ పై రకుల్ అభిప్రాయం ఏంటో చూడండి

నందమూరి నట వారసత్వాన్ని కొనసాగిస్తున్న జూనియర్ ఎన్.టి.ఆర్ కు నందమూరి అభిమానులు, సిని ప్రేక్షకులే కాదు సినిమా సెలబ్రిటీస్ కూడా సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు. తోటి ఆర్టిస్టైనా సరే ఎన్.టి.ఆర్ నటన గురించి మెచ్చుకోవాల్సిందే. స్టార్ హీరోగా వరుస రికార్డులను సృష్టిస్తున్న ఎన్.టి.ఆర్ గురించి టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసింది.

ప్రస్తుతం కెరియర్ వెనుకపడ్డట్టు అనిపిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో అవకాశాలేమి లేకున్నా తమిళ, హింది భాషల్లో ఛాన్సులు అందుకుంటుంది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తను ఇప్పటివరకు నటించిన హీరోల గురించి ప్రస్థావించింది రకుల్. అందులో భాగంగా ఎన్.టి.ఆర్ అనగానే ఇండస్ట్రీకి ఓ వరం.. మంచి డ్యాన్సర్ అనేసింది అమ్మడు.

ఎన్.టి.ఆర్ తో నాన్నకు ప్రేమతో సినిమా చేసింది రకుల్.. సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ సరసన రకుల్ నటించింది. ఎన్.టి.ఆర్ నవసరాలను పలికించగలడు అందుకే ఇండస్ట్రీకి అతనో వరం లాంటోడని అన్నది రకుల్. ఇక మహేష్ ఫ్యాషన్ ఉన్న హీరో అని చెప్పిన రకుల్ చరణ్ చిన్నపిల్లాడి మనస్థత్వం కలవాడని అన్నది.

అల్లు అర్జున్ అద్భుతాలు సృష్టించగలిగిన సత్తా ఉన్న హీరో అని చెప్పింది. మొత్తానికి తనతో నటించిన స్టార్స్ గురించి తన అభిప్రాయం చెప్పింది రకుల్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com