చంద్రబాబు అమెరికా షెడ్యూల్ ఇది

- September 12, 2018 , by Maagulf
చంద్రబాబు అమెరికా షెడ్యూల్ ఇది

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈనెల 22న అమెరికా పర్యటనకు బయలుదేరి వెళుతున్నారు. రాష్ట్ర వ్యవసాయ రంగంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు ఏర్పాటు చేసిన పలు సమావేశాల్లో ఆయన పాల్గొంటారు. అలాగే వ్యవసాయ ప్రధాన అంశాలపై జరిగే రౌండ్ టేబుల్ సమావేశాల్లోనూ మాట్లాడుతారు. వైజాగ్ కేంద్రం ఐటీ పెట్టుబడుల ఆకర్షణ కోసం న్యూయార్క్ నగరంలో ఏపీ ఇప్పటికే భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అమెరికాపర్యటనలో భాగంగా ఈ నెల 24న 'సుస్థిర వ్యవసాయాభివృద్ధిలో ప్రపంచంలో ఎదురువుతున్న సవాళ్లు-ఏపీలో సహజ వ్యయసాయాభివృద్ధి విధానాలు' అనే అంశంపై యూఎన్‌ఈపీ ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబు కీలక ఉపన్యాసం చేస్తారు. 25న వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం-ఏపీ ఎకనమిక్‌ డెవల్‌పమెంట్‌ బోర్డు సంయుక్తంగా ఏర్పాటు చేసే రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొంటారు. 26న కొలంబియా వర్సిటీలో 'గవర్నెన్స్‌ ఇన్‌ ద ఏజ్‌ ఆఫ్‌ టెక్నాలజీ' అనే అంశంపై ప్రసంగిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com