సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- April 12, 2026
రియాద్ః సౌదీ భద్రతా అధికారులు ఒక వారంలో మొత్తం 15,458 మంది అక్రమ నివాసితులను అరెస్టు చేశారు. ఏప్రిల్ 2 నుండి ఏప్రిల్ 8 మధ్య కాలంలో సంబంధిత ప్రభుత్వ సంస్థలతో కలిసి భద్రతా దళాలు సంయుక్త తనిఖీలు నిర్వహించాయి.ఈ సందర్భంగా వారిని అరెస్టు చేసినట్టు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇక అరెస్టు అయిన వారిలో నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వారు 8,440 మంది, సరిహద్దు భద్రతా చట్టాన్ని ఉల్లంఘించిన వారు 4,054 మంది మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వారు 2,964 మంది ఉన్నారు. మొత్తం 7,392 మంది అక్రమ నివాసితులను దేశం నుండి బహిష్కరించగా, 22,942 మంది ఉల్లంఘనదారులను ప్రయాణ పత్రాలను పొందేందుకు వారి దౌత్య కార్యాలయాలకు పంపినట్లు తెలిపింది.
అలాగే, సరిహద్దు దాటి సౌదీలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ 1,600 మంది అరెస్టయ్యారు. వీరిలో 39 శాతం మంది యెమెన్ జాతీయులు, 60 శాతం మంది ఇథియోపియా జాతీయులు మరియు ఒక శాతం మంది ఇతర దేశాలకు చెందిన వారు ఉన్నారు. సౌదీని అక్రమంగా విడిచి వెళుతూ 47 మంది అరెస్టు అయ్యారు.
అక్రమ నివాసితులకు రవాణా, ఆశ్రయం మరియు ఉపాధి కల్పించడంలో సహకరించిన సుమారు 30 మంది వ్యక్తులను కూడా అరెస్టు చేసినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. ప్రస్తుతం, మొత్తం 40,184 మంది విదేశీయులు చట్టపరమైన చర్యలను ఎదుర్కొంటున్నారని వెల్లడించింది.
అక్రమ నివాసితుల సమాచారం తెలిస్తే.. మక్కా, రియాద్ మరియు తూర్పు ప్రావిన్స్ ప్రాంతాలలో 911 నంబరుకు, మిగిలిన ప్రాంతాలలో 999 మరియు 996 నంబర్లకు కాల్ చేసి వేదించాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- భారత్ వైపు వస్తున్న నౌక పై దాడి.. భారతీయుడు మృతి
- బ్యాంక్ మెల్లీ ఇరాన్ పై UAE సెంట్రల్ బ్యాంక్ కఠిన చర్యలు
- అమరావతిలో ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
- భారత్–షార్జా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు డ్రైవర్లకు కీలక సూచనలు..!!
- సౌదీ ప్రజలకు భారత కాన్సుల్ జనరల్ శుభాకాంక్షలు..!!
- బంధువుల మధ్య వివాహాలతో జన్యు వ్యాధుల ముప్పు.. డాక్టర్ల హెచ్చరికలు..!!
- ఓపెన్ ప్రిజన్స్ ప్రోగ్రామ్.. ఖైదీల కళల్లో శాంతి సందేశాలు..!!
- యూఎన్ఓలో ఖతార్ అమిర్ ప్రసంగానికి దౌత్యవేత్తల ప్రశంసలు..!!
- ముత్రా కేబుల్ కార్ భద్రతా ఏర్పాట్లపై సమీక్ష..!!







