ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- April 12, 2026
మస్కట్: భద్రత మరియు పర్యావరణ ప్రమాణాలను పాటిస్తూనే చమురు ఉత్పత్తి సామర్థ్యం మెరుగుపరచడానికి అడ్వాస్సుడ్ టెక్నాలజీ మరియు ఆవిష్కరణలను పాటించడం ద్వారా సహజ వనరుల విలువను గరిష్ఠంగా పెంచేందుకు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నామని ఇంధన మరియు ఖనిజాల మంత్రిత్వ శాఖ తెలిపింది. సమగ్ర వనరుల నిర్వహణ వ్యవస్థ ద్వారా హైడ్రోకార్బన్ విలువను పెంచడం, సుస్థిర ఆర్థిక వృద్ధికి మద్దతు ఇవ్వడం అనే తమ విస్తృత దృక్పథానికి అనుగుణంగానే తమ విధానం ఉందని మంత్రిత్వ శాఖ చెప్పింది.
ఒమన్‌లోని పరిపక్వ చమురు క్షేత్రాల నుండి ఉత్పత్తిని పెంచడంలో మెరుగైన చమురు వెలికితీత (Enhanced Oil Recovery (EOR)) సాంకేతికతలు ఉపయోగిస్తున్నట్టు మంత్రిత్వ శాఖలోని చమురు మరియు గ్యాస్ అన్వేషణ మరియు ఉత్పత్తి డైరెక్టర్ జనరల్ డాక్టర్ సలేహ్ బిన్ అలీ అల్-అన్బౌరీ తెలిపారు. అధునాతన వెలికితీత పద్ధతులను వర్తింపజేయడంలో ఒమన్ ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలిచిందన్నారు.
మంత్రిత్వ శాఖ ప్రకారం, చమురు ఉత్పత్తి ఎక్కువగా మెరుగైన వెలికితీత ప్రాజెక్టులపై ఆధారపడి ఉంది. 2021లో మొత్తం ఉత్పత్తిలో సుమారు 15 శాతంగా ఉన్న EOR, 2026 నాటికి దాదాపు 20 శాతానికి చేరుకుంటుందని అంచనా వేస్తోంది. ఆధునిక, సాంకేతికత ఆధారిత మరియు సుస్థిరమైన చమురు వెలికితీత పద్ధతులను ఉపయోగించి, అగ్రగామి ఉత్పత్తిదారుగా తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి ఒమన్ ప్రయత్నాలు చేస్తుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏపీలో 4 కొత్త పోలీస్ కమిషనరేట్లు.. కేబినెట్ ఆమోదం..!
- ఖోర్‌ఫక్కాన్ పోర్టును సందర్శించిన భారత కాన్సుల్ జనరల్ డా. విష్ణువర్ధన్ రెడ్డి
- UNGAలో జైశంకర్ వరుస భేటీలు.. AI, అంతరిక్షం, UNSC సంస్కరణల పై చర్చలు
- సౌదీలో తెలుగు ప్రవాసులది ప్రత్యేక ఉత్సాహం..భారత రాయబారి విపుల్
- ఖైరతాబాద్ బడా గణేష్‌ను దర్శించుకున్న డీజీపీ సీవీ ఆనంద్
- భారత్–ఖతార్ సంబంధాల బలోపేతం పై చర్చలు
- 120 మంది కార్మికులకు ఎండ నుంచి రక్షణ పై దుబాయ్ పోలీసుల అవగాహన
- ‘ఇరాన్ ఎప్పటికీ తలవంచదు’..ఐరాసలో అధ్యక్షుడు పెజెష్కియన్
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి సంతాపాలు
- 28న మదురైలో ‘మేనమామ బంగారు ఉంగరం పథకం’ ప్రారంభం







