రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చండీయాగానికి హాజరు
- December 17, 2015
* ఈనెల 31 వరకు శీతాకాల విడిది * 27న అయుత చండీయాగానికి హాజరు శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం ఢిల్లీ నుంచి రాష్ట్రానికి రానున్నారు. సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆయన ఈనెల 31 వరకు బస చేస్తారు. ప్రణబ్ ప్రత్యేక విమానంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల తరువాత హకీంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఆయనకు సీఎం కేసీఆర్, ఇతర ప్రముఖులు స్వాగతం పలకనున్నారు. శీతాకాల విడిది సందర్భంగా రాష్ట్రపతి హైదరాబాద్ నుంచే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇప్పటికే ఖరారైన పర్యటన షెడ్యూల్ ప్రకారం రాష్ట్రపతి 19న సికింద్రాబాద్ మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. 22-23 తేదీల్లో కర్ణాటకలో పర్యటిస్తారు. 22న కర్ణాటక కేంద్రీయ విశ్వవిద్యాలయం రెండో స్నాతకోత్సవంలో పాల్గొంటారు. అదే రోజు బెంగుళూరులో ఆధునీకరించిన నిమ్హాన్స్ భవనాన్ని ప్రారంభిస్తారు. 23న బిషప్ కాటన్ బాలుర పాఠశాల 150వ వార్షికోత్సవంలో రాష్ట్రపతి పాల్గొంటారు. బెంగుళూరులోని కిద్వాయి మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ ప్రాంగణంలో స్టేట్కేన్సర్ ఇన్స్టిట్యూట్ భవనానికి శంకుస్థాపన చేస్తారు. 25న ఏపీలోని అయిభీమవరంలో తిరుమల-తిరుపతి దేవస్థానం వేద పాఠశాలను ప్రారంభిస్తారు. 27న హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగే ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ వార్షిక సదస్సులో ప్రారంభోపన్యాసం చేస్తారు. అదే రోజు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్వహిస్తున్న అయుత చండీమహాయాగం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్రపతి గౌరవార్థం 29న తెలంగాణ, ఏపీ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ రాజ్‌భవన్‌లో విందును ఏర్పాటు చేస్తారు. 30న రాష్ట్ర ప్రముఖులు, మంత్రులు, అధికారులు, జర్నలిస్టులు, తదితరులకు రాష్ట్రపతి నిలయంలో విందు ఇస్తారు
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్‌లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









