వివేక్ ఒబెరాయ్ చిరంజీవి 150వ సినిమాలో..
- December 18, 2015
ఇటీవల రామ్ చరణ్ మరోసారి చిరంజీవి 150వ సినిమాను తెర మీదకు తీసుకొచ్చాడు. కత్తి సినిమాను చిరు రీమేక్ చేయనున్నాడని, ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా ప్రకటించటంతో దాదాపుగా ఇదే ఖాయమని ఫీలవుతున్నారు ఫ్యాన్స్. అయితే మెగా క్యాంప్ మాత్రం ఇంత వరకు దీనిపై అధికారికంగా ఏమీ చెప్పలేదు. ప్రకటన రాకపోయినా సినిమా మీద రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే హీరోయిన్ గా తమన్నా గ్యారంటీ అన్న వార్త, కొద్ది రోజులుగా మీడియాలో హల్ చల్ చేస్తుండాగా, తాజాగా ప్రతినాయక పాత్రపై కూడా ఓ ఆసక్తికరమైన వార్త ప్రచారంలోకి వచ్చింది. తమిళ వర్షన్ లో నీల్ నితిన్ ముఖేష్ నటించిన విలన్ పాత్రలో తెలుగు వర్షన్ కు వివేక్ ఒబెరాయ్ ని సెలెక్ట్ చేశారట. ఇప్పటికే రక్తచరిత్ర సినిమాతో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైన వివేక్, ఈ సినిమాతో మరోసారి సౌత్ ఆడియన్స్ ను పలకరించనున్నాడు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







