విశ్వక్షేమం కోసమే అయుత చండీయాగం
- December 18, 2015
విశ్వక్షేమం కోసమే అయుత చండీయాగం నిర్వహిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. శుక్రవారం మెదక్ జిల్లా జగదేవ్ పూర్ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో చండీయాగం కోసం చేపట్టిన పనులను కేసీఆర్ పరిశీలించారు. అనంతరం కేసీఆర్ విలేకర్లతో మాట్లాడుతూ... అయుత చండీయాగం డిసెంబర్ 23 నుంచి 27వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తమిళనాడు గవర్నర్ కె.రోశయ్యలతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు హాజరవుతారని చెప్పారు. ఈ యాగానికి 40 వేల మందిని ఆహ్వానించామని పేర్కొన్నారు. ప్రతిరోజు 50 వేల మందికి ప్రసాదము, భోజనం అందజేస్తామన్నారు. అయితే ఈ యాగానికి వచ్చే భక్తులు స్వీయ నియంత్రణ పాటించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ సూచించారు. చండీయాగానికి అందురూ ఆహ్వానితులే అని చెప్పారు. చండీయాగానికి ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఆహ్వానించానని... ఆయన వచ్చే విషయంపై స్పష్టత మాత్రం ఇవ్వలేదని కేసీఆర్ అన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







