ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్లో చేరేందుకు పుణె అమ్మాయి!
- December 18, 2015
ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్లో చేరేందుకు మహారాష్ట్రలోని పుణెకి చెందిన ఓ 16ఏళ్ల అమ్మాయి ప్రయత్నం చేసింది. అందు కోసం సిరియాలోని ఓ మెడికల్ కళాశాలలో సీటు కోసం దరఖాస్తు చేసుకుని సిరియాకి ప్రయాణమయ్యేందుకు సిద్ధమయ్యింది. విషయం తెలుసుకున్న పుణె యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఆమెను విచారించిన అనంతరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ యువతి పుణెలోని సిటీ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమెకు సోషల్ మీడియా ద్వారా ఇస్లామిక్ స్టేట్ సభ్యులతో స్నేహం ఏర్పడింది. వారు ఆమెకు ఉగ్రవాద భావాల్ని నూరిపోయడంతో ఆమె ఐఎస్లో చేరేందుకు సన్నద్ధమైంది. ఈ విషయమై ఏటిఎస్ పుణె అధికారి భాను ప్రతాప్ బర్గే మాట్లాడుతూ.. 10, 12 రోజుల క్రితం ఏటీఎస్ పోలీసుల నుంచి తమకు ఈ అమ్మాయి విషయమై సమాచారం అందిందన్నారు. టీవీలో ఓ డాక్యుమెంటరీని చూసిన అనంతరం ఆమె ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితురాలయ్యిందని చెప్పారు. అనంతరం ఫేస్బుక్ ద్వారా వివిధ దేశాలకు చెందిన 200 మంది ఐఎస్ సానుభూతిపరులతో స్నేహం కొనసాగిస్తోందని తెలిపారు. గత మూడు నాలుగు నెలల్లో ఇస్లామిక్ స్టేట్కి చెందిన రెండు, మూడు పనుల్లో ఆమె జోక్యం ఉందని వెల్లడించారు. ఆమె తన జీవితంలో కొన్ని మార్పులు కూడా చేసుకుందని వివరించారు. కొంత కాలం నుంచి బురఖా కూడా ధరిస్తోందని తెలిపారు. ఆమె కుటుంబసభ్యులు కూడా ఈ మార్పులను గుర్తించారని చెప్పారు. ఐఎస్ ఆదేశం మేరకు ఆమె సిరియా వెళ్లేందుకు సన్నద్ధమైందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







