శీతాకాలంలో అలర్జీ సమస్యలు...
- December 18, 2015
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా శీతాకాలంలో ఏదో ఒక అలర్జీ సమస్య వేధిస్తుంది. తుమ్ములూ, దగ్గులే కాదు...ఒక్కోక్క సారి శ్వాస తీసుకోవడమే కష్టంగా మారుతుంది. క్రమ క్రమంగా సమస్య తీవ్రమయ్యే కొద్దీ లక్షణాలను బట్టి ఇది మామూలు జలుబు సమస్య కాదని తేలిపోతుంది. అయినా శీతాకాలంలో లర్జీ ఎందుకొస్తుంది, వాటి లక్షణాలేంటి అనేవి గుర్తించాలి. వాటికోసం ఎలాంటి నివారణ పద్థతులను అనుసరించాలో తెలుసుకుంటే శీతాకాలంలో వచ్చే అలర్జీల నుండి ఉపశమనం పొందవచ్చు. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ అసందర్భంగా ప్రతి చర్యను అలర్జీ అంటారు. ఏదైనా ఒక పదార్థానికి శరీరం సాధారణ స్థితి కన్నా ఎక్కువ మొత్తంలో ప్రక్రియను చూపుతుంది, ఆ పదార్థాలను అలర్జెంట్ అని ప్రతిచర్యను అలర్జిక్ రియాక్షన్ అని అంటారు. వాతావరణ మార్పులు అంటే శీతాకాలంలో సమస్య అధికం కావడం, దుమ్ము, ధూళి, ఘాటైన వాసనలు, మస్కిటో రిపెల్లెంట్స్, వివిధ రకాల స్ప్రేలు, పెంపుడు జంతువుల వెంట్రుకలు, శీతలపానీయాలు, ఐస్ క్రీములు వంటివి కారణమవుతుంటాయి. చాలా మందిలో అలర్జీవ వంశపారంపర్యంగా కూడా వస్తుంది. అలర్జీలకు గురైనప్పుడు ముక్కులోని శ్లేష్మపొర వాపుకు గురౌతుంది. దాంతో ముక్కు నుంచి నీరు కారడం, తుమ్ములు, ముక్కుదిబ్బడ, జ్వరం, కీళ్లనొప్పులు వంటి సమస్యలు వస్తాయి. మరి ఈ సమస్యలు రాకుండా శీతాకాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అలర్జీని నివారించుకోవచ్చు. అదెలాగో క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం. శీతాకాలంలో శరీరం అతి తక్కువ ఉష్ణోగ్రతకు గురిఅవుతుంది . వివిధ రకాల వైరస్ , ఫంగైలకు ఆహ్వానం పలికినట్లే.. ఇది వ్యాధినిరోధకత మీద ప్రభావం చూపుతుంది దాంతో వివిధ రకాల సీజనల్ అలర్జీలకు కారణం అవుతుంది. వీటిని నివారించాలంటే శరీరం మొత్తాన్ని కవర్ అయ్యేలా వెచ్చగా కప్పి ఉంచుకోవాలి. ఇంట్లో వాతావరణం వెచ్చగా ఉంచుకోవాలి. వింటర్లో రూమ్ మీటర్స్, హుమిడిఫైయర్స్ ను ఉపయోగించుకోవాలి.గదులను హాట్ గా, వేడిగా ఉంచుకోవాలి. వైరస్ నుండి రక్షణ పొందడానికి ఇది ఒక గ్రేట్ మార్గం. హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల వ్యాధినిరోధకతను పెంచుకోవచ్చు . దాంతో వివిధ రకాల వ్యాధుల నుండి మన శరీరాన్ని రక్షించుకోవచ్చు. అలర్జీలకు దూరంగా ఉండవచ్చు. వేసవికాలం కంటే చలికాలంలో బ్యాక్టీరియ, వైరస్ చేరే అవకాశం ఎక్కువ కనుకు మ్యాట్రస్ మరియు కార్పెట్స్ ను ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉంచుకోవాలి . దాంతో మేజర్ గా వచ్చే అలర్జీలనుండి తప్పించుకోవచ్చు. అలర్జీలకు మరో ప్రధాన కారణం పెంపుడు జంతువులు, మీరు ఊహించిన దాని కంటే ఎక్కువగా అలర్జీలకు గురిఅవుతుంటారు కాబట్టి పెట్స్ రూమ్ ను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తుండాలి.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







