ఎంత వరకు....!!
- December 18, 2015
నా నీకు.....
రహదారులన్నీ మూసేసి ఉన్నాయి.... చీకటి వాకిలి తెరచుకుంది నిశబ్దంగా నాకు తెలియకుండానే... పక్కనే నువ్వు ఉన్నావనే అనుకుంటూనే లేవన్న నిజాన్ని దాచేయాలని ఎంతగా ప్రయత్నిస్తున్నానో.... అయినా ఎప్పుడో చెప్పిన మాటలు నువ్వు మర్చిపోయావని అవి మనసు నుండి రాలేదని తెలియని ఈ పిచ్చి మాలోకం ఇంకా నిన్ను నమ్ముతూనే బతికేస్తోంది... ఎప్పటికైనా నువ్వు మారకపోతావా అని ఎదురుచూస్తూ మరో లోకానికి తన పయనం ఖరారైందని తెలిసినా నీ వరకు రానివ్వని ఆ నిజాన్ని అలానే రాకుండా చేయాలని చూస్తూ నువ్వు దూరం చేసిన సంతోషం చిరునామా కోసం వెదుకుతూ మళ్ళి నీ దగ్గరే అది ఆగి పోతుంటే నవ్వుకుంటూ ఉండిపోతున్నా ఏం చేయాలో తెలియక.... రాని నవ్వుని బలవంతంగా అద్దుకుని ఆ చిరునవ్వు చాటున రగులుతున్న మంటలను చల్లబరచాలని... నలుగురిలో నవ్వుతూ జీవం లేని ఈ జీవితంలో జీవాత్మ శోకాన్ని వినపడనివ్వని ఆడంబరాల హంగుల మధ్యలో దాచేస్తూ బతికేయాలన్న ఈ తాపత్రయం ఎంత వరకు సఫలీకృతం అవుతుందో మరి.....!!
--మంజు యనమదల
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







