సౌదీ లో ముగిసిన క్షమాభిక్ష గడువు

- December 18, 2015 , by Maagulf
సౌదీ లో ముగిసిన క్షమాభిక్ష గడువు

సౌదీ అరేబియాలో అక్రమంగా ఉంటున్న కార్మికులను అక్కడి పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన దాదాపు 3 వేల మంది కార్మికులను అరెస్టు చేసినట్లు సమాచారం. తెలంగాణకు చెందిన సుమారు 350 మంది కార్మికులు పట్టుబడ్డట్లు కొందరు కార్మికులు 'సాక్షి'కి ఫోన్‌లో చెప్పారు. సౌదీకి వర్క్ వీసాపై వెళ్లిన కార్మికులు కొన్ని కారణాల వల్ల కంపెనీ నుంచి బయటకు వచ్చి కల్లివిల్లిగా పని చేస్తున్నారు. మరి కొందరు విజిట్ వీసాపై వెళ్లి వీసా గడువు ముగిసిపోయినా అక్కడే ఉండి బయట ఏదో ఒక పని చేస్తున్నారు. సౌదీలో పనిచేసే వారిలో తెలంగాణ జిల్లాలకు చెందినవారు లక్ష మంది ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com