పోలవరం ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస్ రావు వాహనంలో మంటలు
- December 18, 2015
హైదరాబాదు నగరంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో శుక్రవారం అసెంబ్లీ ముగిసిన కొద్ది సేపటికే అసెంబ్లీ ఎదుట ఉన్న కారులో మంటలు చెలరేగాయి. ఈ సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది. కారు (ఎపి29సిబి0078)ఇంజన్లో ఏర్పడిన సమస్యవల్లే మంటలు చెలరేగాయన్న విషయం తెలుసుకొని పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస్ రావు వాహనం ఇంజన్లో చెలరేగిన మంటలు ఒక్కసారిగా ఎగిసిపడటంతో కారు పూర్తిగా దగ్ధమైంది. శుక్రవారం రాత్రి అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు వాహనంలో వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. కారు అలైంటింగ్ పాయింట్ నుండి నర్సరి దాటి వస్తుండగా ఒకేసారి కారులో మంటలు అంటుకున్నాయి. ఇది గమనించిన బందోబస్తులో ఉన్న పోలీసులు అప్రమత్తమై కారులో ఉన్న ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస్రావుతో పాటు గన్మెన్, డ్రైవర్ను కిందికి దింపారు. దీంతో ఎమ్మెల్యేకు తృటిలో ప్రణాపాయం తప్పింది. షార్ట్సర్క్యూట్ కారణంగానే కారు ఇంజన్లో మంటలు అంటుకున్నాయని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనలో ఎవ్వరికి గాయాలు కాలేదని ఎమ్మెల్యేతో పాటు గన్మెన్, డ్రైవర్ సురక్షితంగా బయట పడ్డారనిసైఫాబాద్ పోలీసు ఇన్స్పెక్టర్ కె.పూర్ణచందర్ తెలిపారు
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







