సినిమా షూటింగ్‌లో విద్యుదాఘాతంతో మృతి..

- December 19, 2015 , by Maagulf
సినిమా షూటింగ్‌లో విద్యుదాఘాతంతో మృతి..

సినిమా షూటింగ్‌లో అపశృతి చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం పరిధిలోని సంఘీ నగర్‌లో శనివారం నాని హీరోగా నటిస్తున్న ఓ చిత్ర షూటింగ్ జరుగుతోంది. ఆ సమయంలో తిరుపతి అనే వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. దీంతో భయపడిపోయిన యూనిట్ సిబ్బంది షూటింగ్ నిలిపివేసి వెళ్లిపోయారు. తిరుపతి మృతదేహాన్ని కూడా అక్కడి నుంచి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com