తెలంగాణ:కాంగ్రెస్ ఎన్నికల కమిటీ తీర్మానాలు ఇవే..
- October 06, 2018
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు కాంగ్రెస్ నేతలు. ''అక్టోబర్ 9లోగా సీట్ల సర్దుబాటు పూర్తి చేసుకోవాలి. 14 నాటికి అభ్యర్థుల జాబితా ప్రకటించాలి. డిపాజిట్ కోల్పోయిన వారికి టికెట్ ఇవ్వొద్దు. రెండుసార్లు ఓడిన వారికి టికెట్ ఇవ్వొద్దు. విశ్వసనీయత, గెలుపు ప్రామాణికంగా అభ్యర్థుల ఎంపిక. కాంగ్రెస్ అనుబంధ సంఘాల నేతలకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలి. రాష్ట్ర స్థాయిలోనే ఒక అభ్యర్థిని ఎంపిక చేసి హైకమాండ్‌కు లిస్టు పంపాలి. గెలిచే స్థానాలను మిత్రపక్షాలకు వదులుకోవద్దు. గెలుపు ప్రామాణికంగా పొత్తులు ఉండాలి.'' అని కాంగ్రెస్ నేతలు తీర్మానం చేశారు. అంతేకాదు ఈ సమావేశంలో సీపీఐకి ఇచ్చే సీట్లపై కూడా చర్చించారు. ఖమ్మంలో సీపీఐకి స్థానాలు ఇవ్వొద్దని నిర్ణయించారు. గత ఎన్నికల్లో సీపీఐకి మూడు స్థానాలు ఇస్తే డిపాజిట్ రాలేదని ఈ సమావేశంలో గుర్తు చేశారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







