అరేబియన్ సముద్రంలో తుపాను
- October 08, 2018
మస్కట్: అరేబియన్ సముద్రంలో ట్రాపికల్ డిప్రెషన్, ట్రాపికల్ స్టార్మ్‌గా మారింది. దీనికి లుబాన్ అనే పేరుని పెట్టినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ పేర్కొంది. ప్రస్తుతం ట్రాపికల్ స్టార్మ్‌గా ఇది రూపాంతరం చెందిందనీ, ఎప్పటికప్పుడు ఈ ట్రాపికల్ స్టార్మ్ తీవ్రతను అంచనా వేస్తూనే వుంటామని పిఎసిఎ వివరించింది. ట్రాపికల్ సిస్టమ్ కేంద్రం సలాలాకు 940 కిలోమీటర్ల దూరంలో వుంది. కేంద్రం తాలూకు వేగం 35 నుంచి 40 నాట్స్ వరకు వుందని అంచనా వేశారు. తీరం నుంచి 400 కిలోమీటర్ల దూరంలో కన్వెక్టివ్ క్లౌడ్ బ్యాండ్స్ వున్నాయి. ఒమన్ తీరాన్ని ఈ తుపాను తాకనుంది. అంతకు ముందు భారతదేశంపై తుపాను విరుచుకుపడే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







