సన్నీలియోన్ పై భగ్గుమన్న కన్నడ సంఘాలు
- October 08, 2018
బెంగుళూరు: బాలీవుడ్ తార సన్నీలియోన్ పై కన్నడ సంఘాలు భగ్గుమన్నాయి. ఆమెకు వ్యతిరేకంగా బెంగుళూరులో కర్ణాటక రక్షణ వేదిక యువసేన ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కన్నడిగులు వీరనారిగా కొలిచే వీర మహాదేవి పాత్రను సన్నీలియోన్ పోషించడమే ఈ ఆగ్రహానికి కారణం. ఈ సందర్భంగా కన్నడ సంఘాల నేతలు మాట్లాడుతూ, 'అమోఘవర్ష నృపతుంగ' కథ ఆధారంగా రూ. 100 కోట్ల బడ్జెట్ తో కన్నడ, తెలుగు, తమిళం, మళయాళం భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని చెప్పారు. నీలి చిత్రాల్లో నటించిన సన్నీలియోన్ ఈ పాత్రను పోషించడం దారుణమని అన్నారు. ఈ సినిమా షూటింగ్ ను వెంటనే నిలిపి వేయాలని డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







