గూగుల్ ప్లస్ మూసివేత

- October 08, 2018 , by Maagulf
గూగుల్ ప్లస్ మూసివేత

వాషింగ్టన్ : ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ గూగుల్.. తనకు చెందిన సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ గూగుల్ ప్లస్‌ను మూసివేయనున్నది. దీనికి సంబంధించిన నిర్ణయాన్ని ఆ సంస్థ వెల్లడించింది. సాంకేతిక సమస్యల కారణంగా సుమారు 5 లక్షల మంది యూజర్ల డేటా చోరీ అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో గూగుల్ ప్లస్‌ను మూసివేసేందుకు నిర్ణయించారు. గూగుల్ ప్లస్ వైస్ ప్రెసిడెంట్ బెన్ స్మిత్ ఈ విషయాన్ని చెప్పారు. ప్రాజెక్టు స్ట్రోబ్ కింద గూగుల్ చేపట్టిన సెర్చ్‌లో టెక్నికల్ బగ్‌ను గుర్తించారు. గూగుల్ ప్లస్‌లో బగ్ వచ్చినట్లు ఆ సంస్థ ఆరునెలల క్రితమే గుర్తించింది. గూగుల్ సీఈవో సుందర్ దీనిపై సమీక్ష నిర్వహించారు. మార్చ్ నెలలోనే ఆ సాఫ్ట్‌వేర్ బగ్‌కు విరుగుడు కనుగున్నారు. కానీ ఆ లోపు 5 లక్షల అకౌంట్ల సమాచారం బయటకు వెళ్లిపోయింది. అయితే ఆ డేటా మాత్రం ఎటువంటి హానికి గురికాలేదు అని గూగుల్ వెల్లడిస్తున్నది. కాగా, గూగుల్ ప్లస్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించడంతో మాతృ సంస్థ అల్పాబెట్ షేర్లు పడిపోయాయి. షేర్లు 1.5 శాతం పడిపోయాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com