'ప్రవాసిమిత్ర' అవార్డుల ప్రదానం

- December 19, 2015 , by Maagulf

అంతర్జాతీయ వలసవాదుల దినోత్సవ వేడుకలు 'మైగ్రెంట్స్‌ రైట్స్‌ కౌన్సిల్‌' ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి కౌన్సిల్‌ ఉపాధ్యక్షుడు భీమ్‌రెడ్డి అధ్యక్షత వహించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ,యు.ఏ.ఈ అడ్వకేట్ ఓబ్బిలిసెట్టి అనురాధ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన 10 లక్షల మంది గల్ఫ్‌ దేశాల్లో వున్నారనీ, వారి బాగోగుల గురించి ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు తమ పార్టీ ప్రయత్నిస్తుందని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. తెలగు రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులకు సహాయం చేస్తున్న స్వచ్ఛంద సేవకులను గుర్తించి, వారికి ప్రతి యేడాదీ అంతర్జాతీయ వలస దారుల దినోత్సవం సందర్భంగా ప్రవాసి మిత్ర అవార్డుల్ని అందజేస్తుంది మైగ్రెంట్స్‌ రైట్స్‌ కౌన్సిల్‌ సంస్థ. ఈ సారి శాంతి ప్రియ (మలేఇఃసయా), రాంరెడ్డి యేళ్ళ (సింగపూర్‌), గంగాధర్‌ గడ్డం (దుబాయి), గిరీష్‌ సంత్‌ (దుబాయి), శరత్‌ యలమర్తి (షార్జా)లకు జీవన్‌రెడ్డి ప్రవాసి మిత్ర అవార్డులతో సత్కరించారు. 

మాగల్ఫ్.కామ్ తరుపున అవార్డు గ్రహితులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com