పందెం కోడి 2 మేకింగ్ వీడియో విడుదల
- October 13, 2018
లింగుస్వామి దర్శకత్వంలో విశాల్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన చిత్రం సందకోళి 2. తెలుగులో ఈ మూవీ పందెం కోడి 2 పేరుతో విడుదల కానుంది. వరలక్ష్మీ శరత్ కుమార్ చిత్రంలో లేడి విలన్‌గా కనిపించనుంది. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ, పెన్ స్టూడియోస్ బ్యానర్లపై విశాల్, ధావల్ జయంతిలాల్, అక్షయ్ జయంతిలాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ సాధించింది. ట్రైలర్‌లో విశాల్ రఫ్ఫాడించగా, కీర్తి సురేష్ తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. లేడి విలన్ గెటప్‌లో వరలక్ష్మీ లుక్ కేక పుట్టించింది. జాతర లో పులి వేషాలు వేయొచ్చు..కానీ పులి ముందే వేషాలు వేయకూడదు అనే డైలాగ్ అదిరిపోయింది. దసరా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 18న విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మూవీపై ఆసక్తి పెంచేలా మేకర్స్ పలు వీడియోస్ విడుదల చేస్తున్నారు. రీసెంట్‌గా మేకింగ్ వీడియో విడుదల చేయగా, ఇది అభిమానులని ఆకట్టుకుంటుంది. మీరు వీడియోపై ఓ లుక్కేయండి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







