ప్రిన్స్ మహేష్ బాబు హిందీ మూవీ ట్రైలర్ విడుదల
- October 13, 2018
టాలీవుడ్ నటుడు మహేశ్ బాబుకు దక్షిణాది సినీ పరిశ్రమలోనే కాకుండా వేరే రాష్ట్రాలలోను ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మహేశ్ నటించిన భరత్ అనే నేను బాక్సాపీస్ వద్ద మంచి హిట్‌గా నిలిచింది. ఈ సినిమా కలెక్షన్ల పరంగా నాన్ బాహుబలి రికార్డు (బాహుబలిని మినహాయించి)ను కూడా సొంతం చేసుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో ఫిక్షన్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రంలో కైరా అద్వానీ కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో మహేష్ డైనమిక్ సీఎంగా కనిపించి సందడి చేశాడు. తెలుగులో ఘన విజయం సాధించిన ఈ చిత్రం తమిళంలో భరత్ ఎనుము పేరుతో విడుదల కాగా, మలయాలంలో భరత్ ఎన్న అంజాన్‌గా రిలీజ్ అయింది. ఇక ఇప్పుడు హిందీలో అనువాదం జరుపుకున్న ఈ చిత్రం విడుదలయ్యేందుకు సిద్ధం కాగా, తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. భారత్ :ది గ్రేట్ లీడర్ పేరుతో విడుదల కానున్న చిత్ర ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆర్ఎజీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని హిందీలో విడుదల చేస్తుంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌పై మీరు ఓ లుక్కేయండి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







