ఒకే ఫోన్లో రెండు Whatsapp లను వాడడం ఎలాగో తెలుసుకోండి
- October 16, 2018
ఈ రోజుల్లో, దాదాపుగా అన్ని స్మార్ట్ ఫోన్లు కూడా డ్యూయల్ సిమ్ కార్డుతో వస్తున్నాయి. ఈ రెండు నంబర్లకు గాను విడివిడి రెండు వాట్స్అప్ వాడుకునే వీలుంటే, మీరు మీకు నచ్చినట్లుగా విడివిడిగా చాట్ చేసుకోవచ్చు. మీరు అలాగ డ్యూయల్ వాట్స్ఆప్ వాడనుకోవడానికి ప్రత్యేకంగా ఏవిధమైన ప్రయాస పడవలసిన అవసరంలేదు. మీరు వాడుతున్న ఫోన్లోనే ఈ ఎంపిక మీకు అందుబాటులో ఉంటుంది.
అయితే, అధికారకంగా రెండు వాట్స్అప్ లను వాడకూడదు కానీ, షావోమి, శామ్సంగ్, వివో, ఒప్పో, హువావే మరియు హానర్ వంటి కంపెనీలు ఇపుడు డ్యూయల్ ఆప్స్ లేదా డ్యూయల్ మోడ్ వంటి పేర్లతో ఫోన్లలో ఈ వెసులుబాటును కలిగిస్తున్నాయి. అంటే, మీరు ఒకేసారి రెండు నెంబర్లతో డ్యూయల్ వాట్స్అప్ వాడుకోవచ్చన్నమాట. ఏయే కంపెనీలు ఎలా వాటి డ్యూయల్ వాట్స్అప్ ని అందిస్తున్నాయో చుడండి.
షావోమి : డ్యూయల్ ఆప్ : సెట్టింగ్ లోపలి వెళ్ళండి మరియు డ్యూయల్ ఆప్ ఎంచుకున్నతరువాత వాట్స్ ఆప్ ఎనేబుల్ చేయండి
ఒప్పో : క్లోన్ ఆప్ : సెట్టింగ్ లోపలి వెళ్ళండి మరియు క్లోన్ ఆప్ ఎంచుకున్నతరువాత వాట్స్ ఆప్ ఎనేబుల్ చేయండి
శామ్సంగ్ : డ్యూయల్ మేనేజర్ : సెట్టింగ్ లోపలి వెళ్ళండి తరువాత అడ్వాన్స్ ఫీచర్స్ లోకి వెళ్లి డ్యూయల్ మేనేజర్ ఎంచుకున్నతరువాత వాట్స్ ఆప్ ఎనేబుల్ చేయండి
అసూస్ : ట్విన్ అప్స్ : సెట్టింగ్ లోపలి వెళ్ళండి మరియు ట్విన్ అప్స్ ఎంచుకున్నతరువాత వాట్స్ ఆప్ ఎనేబుల్ చేయండి
హువావే: ఆప్ ట్విన్ : సెట్టింగ్ లోపలి వెళ్ళండి మరియు ఆప్ ట్విన్ ఎంచుకున్నతరువాత వాట్స్ ఆప్ ఎనేబుల్ చేయండి
హానర్ : ఆప్ ట్విన్ : సెట్టింగ్ లోపలి వెళ్ళండి మరియు ఆప్ ట్విన్ ఎంచుకున్నతరువాత వాట్స్ ఆప్ ఎనేబుల్ చేయండి
పైన తెలిపిన ప్రకారంగా, వాట్స్ఆప్ ఎనేబుల్ చేసినతరువాత ఈ ప్రాసెస్ పూర్తియిన తరువాత హోమ్ స్క్రీన్లోకి వెళ్ళండి. అక్కడ కొత్తగా వచ్చినా వాట్స్ఆప్ రెండవ ఆప్ ని మీ మరొక మొబైల్ నెంబర్తో జోడించి వాడుకోవచ్చు.
తాజా వార్తలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!







