తొలిసారిగా ఒక ఆర్థిక నేరస్తుడిని బహ్రెయిన్ నుంచి భారత్ కు రప్పించిన సిబిఐ
- October 16, 2018
న్యూఢిల్లీ : విదేశాలుకు పారిపోయిన ఒక ఆర్థిక నేరస్తుడిని తిరిగి భారత్‌కు రప్పించడంలో సిబిఐ వర్గాలు తొలిసారిగా విజయం సాధించాయి. బెంగళూరుకు చెందిన ఆర్థిక నేరస్తుడు మహ్మద్ యాహ్యా (47) ను బహ్రెయిన్‌లో అరెస్టుచేసి ఎయిరిండియా విమానంలో శుక్రవారం ఉదయం ఢిల్లీ తీసుకు వచ్చారు. అక్కడ నుండి మరింత దర్యాప్తు కోసం బెంగళూరు తరలించారు. 2003లో రూ.46 లక్షల మేర రెండు బ్యాంకులను యాహ్యా మోసగించాడు. దీనిపై సిబిఐ 2009లో దర్యాప్తు ప్రారంభించింది. అప్పటికే యాహ్యా బహ్రెయిన్‌కు పారిపోయాడు. దర్యాప్తు పూర్తయిన తరువాత సిబిఐ చార్జిషీటు దాఖలు చేసింది. ప్రత్యేక సిబిఐ కోర్టు యాహ్యాను ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించింది. నేర కుట్ర, విశ్వాస ఉల్లంఘన నేరం, ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి నకిలీ పత్రాలతో రుణాలు తీసుకోవడం, ఉద్దేశపూర్వకంగా వాటిని చెల్లించకపోవడం తదితర అభియోగాలను యాహ్యాపై సిబిఐ నమోదు చేసింది. ఈ క్రమంలో భారత ప్రభుత్వ అభ్యర్ధనపై ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేయడంతో కొన్ని నెలల క్రితం బహ్రెయిన్ అధికారులు యాహ్యాను గుర్తించి అరెస్టు చేశారు. అనంతరం భారత ప్రభుత్వం ఉన్నత స్థాయిలో బహ్రెయిన్ అధికారులతో సంప్రదించి, అతన్ని భారత్‌కు తీసుకు వచ్చే ఏర్పాట్లు చేసింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







