గుమ్మడి గింజలు సేవిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయంటే?
- October 16, 2018
గుమ్మడి గింజలు తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఈ గింజల్లోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుటకు ఉపయోగపడుతాయి. మెదడు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుటకు మంచి ఔషధంగా పనిచేస్తాయి. పురుషులకు శృంగార సామర్థ్యన్ని పెంచుతుంది.
గుమ్మడి గింజల్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఈ ఫైబర్ అల్సర్ వంటి సమస్యల నుండి కాపాడుతుంది. శరీరంలోని వేడిని తగ్గించేందుకు ఇలా చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చును. గుమ్మడి గింజలను ఎండబెట్టి పొడిచేసుకోవాలి. ఈ పొడిలో కొద్దిగా వేడినీళ్లల్లో కలిపి కొద్దిగా ఉప్పు వేసుకుని తీసుకుంటే శరీర వేడి తగ్గుముఖం పడుతుంది.
తలనొప్పి, కీళ్ల నొప్పులు వంటి సమస్యలతో బాధపడేవారు ఈ గింజలతో తయారుచేసిన నూనె వాడితే మంచి ఉపశమనం లభిస్తుంది. నిద్రలేమి వంటి సమస్యలు తొలగిపోతాయి. అధిక రక్తపోటును అదుపులో ఉంచుతాయి. శరీరానికి కావలసిన మెగ్నిషియం గుమ్మడి గింజల్లో పుష్కలంగా లభిస్తుంది. అందువలన ప్రతిరోజూ ఈ గింజలను తరచుగా ఆహారంలో చేర్చుకుంటే మంచిది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







