విడుదల అయిన విజయ్ 'సర్కార్' టీజర్!
- October 19, 2018
తమిళ స్టార్ హీరో విజయ్, దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్నచిత్రం 'సర్కార్'. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఘన విజయాలు అందుకోవడంతో ఈ సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. తాజాగా ఈ సినిమా టీజర్ నివిడుదల చేసింది చిత్రబృందం. టీజర్ అంచనాలకు తగ్గట్లుగానే ఉంది. విజయ్ తనదైనస్టయిల్ లో చెప్పే డైలాగులు టీజర్ కి హైలైట్ గా నిలిచాయి. 'ఐ యామ్ ఏ కార్పొరేట్క్రిమినల్' అంటూ యాటిట్యూడ్ తో విజయ్ చెప్పిన డైలాగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. రాజకీయాలు, కార్పొరేట్ నేపధ్యంలో సాగే ఈ సినిమా దీపావళిసంధర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కీర్తి సురేశ్ హీరోయిన్ గా కనిపిస్తుండగా..వరలక్ష్మీ శరత్ కుమార్, రాధారవి ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఏఆర్ రెహ్మాన్సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తెలుగు హక్కులని అశోక్ వల్లభనేని దక్కించుకున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







