బయపెడుతున్నకుర్ర " కారు " డ్రైవింగ్ ప్రమాదకరంగా మారిన ఒమాన్ రోడ్లు
- December 20, 2015
లైసెన్స్ లు లేకుండా జోరుగా వాహనాలను రోడ్లపై నడుపుతున్న కుర్రకారును ప్రోత్సాహించేది వారి తల్లితండ్రులే అంట ....ఇది తప్పు అని తెల్సినా వారిని అలా రోడ్ల పైకి..పురిగొల్పడం తో పలువురు ప్రమాదాలకు లోనవుతున్నారు. సుల్తాన్ కబోస్ విశ్వవిద్యాలయం జరిపిన పరిశోధనలో పలు ఆసక్తికర సంగతులు వెలుగు లోనికి వచ్చయి. ఉన్నత పాటశాలలకు చెందిన ముగ్గురు విద్యార్ధులలో ఒక్కరు లైసెన్సులు లేకుండా కారును పలుమార్లు ఒమాన్ రోడ్లపై వేగంగా నడిపినట్లు అంగీకరిస్తున్నారు. అలాగే, 3,345 మాధ్యమిక పాటశాలల విద్యార్దులు పై సర్వేను సదరు విశ్వవిద్యాలయం నిర్వహించగా , వీరిలో 34 శాతం మంది విద్యార్ధులు , తాము అత్యంత వేగంగా కార్లను రోడ్లపై నడపడం బాగా ఇష్టపడతామని నిజాయతీగా ఒప్పుకున్నారు. వీరిదూకుడుకు కళ్ళెం వేస్తూ , రాయల్ ఒమాన్ పోలీస్ ఉన్నతాధికారి ఈ సందర్భంగా మాట్లాడుతూ, వీడియో గేమ్స్ ప్రభావితమై ఆ తరహా డ్రైవింగ్ రోడ్లపై చేస్తూ పలు ప్రమాదాలకు కారణమవుతున్నారన్నరు. ఎటువంటి అనుమతులు లేకుండా పిల్లలు, యువత కార్లను నడిపితే , అటువంటి వారు తమ జైలులో 24 గంటలు ఉండేలా శిక్షను విడిస్తామని, అంతే కాకుండా , వారికి చెందిన వాహనాలను సీజ్ చేసి, 50 ఒమాన్ రియాళ్ళను జరిమానాను విఢించనున్నమని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







