హైపర్‌ మార్కెట్‌లో అగ్ని ప్రమాదం

- December 20, 2015 , by Maagulf
హైపర్‌ మార్కెట్‌లో అగ్ని ప్రమాదం

విలియత్‌ ఆఫ్‌ ముసానాహ్‌లోని ఓ హైపర్‌ మార్కెట్‌ స్టోర్‌ హౌస్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై పబ్లిక్‌ అథారిటీ ఫరస్‌ సివిల్‌ డిఫెన్స్‌ మరియు అంబులెన్స్‌ (పిఎసిడిఎ) స్పందిస్తూ, తమ శాఖకు చెందిన ఫైర్‌మెన్‌ పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని, మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినట్లు చెప్పింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదని అధికారులు వెల్లడించారు. 2014లో ఒమన్‌లో సుమారు 3,335 అగ్ని ప్రమాదాలు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com