గ్రేడ్ 1 స్టూడెంట్స్‌కి ఫీజు వార్తలు అవాస్తవం
- December 20, 2015
ప్రభుత్వ స్కూళ్ళలో గ్రేడ్ 1 విద్యార్థులు ఇకపై ఫీజులు చెల్లించాల్సి వస్తుందంటూ వినిపిస్తున్న ఊహాగానాల్ని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కొట్టి పారేసింది. ప్రభుత్వ స్కూళ్ళలో గ్రేడ్ 1 విద్యార్థుల కోసం ఎలాంటి ఫీజు ప్రతిపాదన లేదని మినిస్ట్రీ స్పష్టం చేసింది. గ్రేడ్ 1 విద్యార్థులు ఇక నుంచి 10 ఒమన్ రియాల్స్ ఎడ్యుకేషన్ ఫీజ్ కింద చెల్లించాల్సి ఉంటుందని ట్విట్టర్లో ప్రచారం జరుగుతుంది. అయితే ప్రభుత్వ స్కూళ్ళలో ఒమన్ పౌరులకు ఉచిత విద్యుత్ కొనసాగించాలనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నామనీ, ఇది ఒమన్ సిటజన్స్ హక్కు అని మినిస్ట్రీ చెప్పింది. దీనికి సంబంధించి ఎటువంటి రూమర్స్నీ ఒమన్ సిటిజన్స్ నమ్మరాదని ఎడ్యుకేషన్ మినిస్ట్రీ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







