సల్మానియా ప్రమాదంలో మరొకరి మృతి
- November 02, 2018
బహ్రెయిన్:గత నెలలో సల్మానియాలో భవనం కూలి నలుగురు చనిపోగా, తాజాగా ఈ ఘటనకు సంబంధించి మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారికి వివిధ కేటగిరీల్లో గాయాలయ్యాయి. ఆ గాయాలకు మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నారు. తాజాగా మృతి చెందిన వ్యక్తిని సలెమ్ హబి ఉల్లాగా గుర్తించారు. బిడిఎఫ్ ఆసుపత్రిలో 70 శాతం కాలిన గాయాలతో హబీ ఉల్లా చేరారు. బహ్రెయిన్‌లో 2012 నుంచి వుంటోన్న హబి ఉల్లా, మైసన్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు అధికారులు. మృతి చెందిన హబి ఉల్లాకి భార్య, ముగ్గురు కుమారులున్నారు. వారంతా బంగ్లాదేశ్‌లో వున్నారు. ప్రస్తుతం వైద్య చికిత్స పొందుతున్న ముగ్గురిలో ఇద్దరు సల్మానియా మెడికల్ కాంప్లెక్స్‌లోనూ, మరొకరు బిడిఎఫ్ ఆసుపత్రిలోనూ వైద్య చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







