నవంబర్ 5న విడుదల కానున్న మల్టీస్టారర్ మూవీ ఫస్ట్ లుక్
- November 04, 2018
టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం ఎఫ్2 (ఫన్ అండ్ ఫస్ట్రేషన్). వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలలో హ్యట్రిక్ విజయాల దర్శకుడు అనీల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మాస్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంకి సంబంధించిన అప్‌డేట్స్ ప్రేక్షకులలో ఆనందాన్ని కలిగిస్తున్నాయి. రీసెంట్‌గా కూలీ బ్యాడ్జీలతో ఇద్దరు హీరోల ఫోటోని అనీల్ రావిపూడి సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇది వైరల్ అయింది . తాజాగా ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను దీపావళి కానుకగా నవంబర్ 5న సాయంత్రం 4గంటలకు విడుదల చేయనున్నారని చిత్ర యూనిట్ కొద్దీ సేపటి క్రితం అధికారికంగా ప్రకటించింది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ థాయ్‌లాండ్‌లో జరుగుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెంకీ సరసన తమన్నా, వరుణ్ తేజ్‌తో మెహరీన్ జతకట్టారు. ముంబై ప్రాంతానికి సంబంధించిన కథ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ విడుదల కానుంది.
తాజా వార్తలు
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!







