ఒమాన్ లో సరైన ఆహార భద్రతా ప్రమాణాలను పెంపొందించాలని పిలుపు
- December 21, 2015
ఒమాన్ లోని బుషేర్ ప్రాంతంలో సగం అల్పాహారశాలలో కనీసం ఆహార భద్రతా ప్రమాణాలను పాటించడం లేదని తేలింది.
పార్లమెంటేరియన్ సభ్యులు , ఆహార భద్రతా నిపుణుల బృందం స్థానిక మునిసిపల్ అధికారులకు ఇటీవల ఇచ్చిన సూచన
మేరకు పలు అల్పాహారశాలలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ దాడిలో ఎన్నో ఆశ్యరకరమైన సంగతులు వెలుగులోనికి
వచ్చాయి. ఏ మాత్రం ఆహార భద్రతా ప్రమాణాలను పాటించకుండా, వినియోగదారుల ఆరోగ్యాన్ని పాడు చేసే పరిస్తితులే అక్కడ
అధికంగా ఉంటున్నాయి .ఇందుకు సంబంధిత రెస్టరెంట్ యాజమాన్యాలు భారీ జరిమానాలను వడ్డించడం లో వెనుకాడాల్సిన
పని లేదని ఆ బృందం మార్గ నిర్దేశం చేసింది. అల్పాహారశాలలకు వచ్చిన వినియోగదారుడు నేరుగా వంటశాల లోనికి ప్రవెశించ
లేడు కనుక, మునిసిపల్ అధికారులే చొరవ తీసుకొని వంటలు చేసే చోటుకి వెళ్ళి ఆహార పరీక్షలు జరపాలని అన్నారు. తయారీ
విధానాన్ని శ్రద్దగా గమనించాలని కోరారు. ముస్కేట్ మునిసిపల్ పరిధిలో స్థానిక అధికార్లు 125 రెస్టారెంట్లపై మెరుపు దాడి
చేశారు. ఇందులో 53 అల్పాహారశాలలో కనీసం ఆహార భద్రతా నాణ్యతా ప్రమాణాలను పాటించడం లేదని గుర్తించారు. ఆహార
పదార్ధాల నుండి దుర్వాసన వెదజల్లడం , ఈగలు ముసురుతున్న మరో రెండు రెస్టారెంట్లను గుర్తించి వాటి అనుమతిని రద్దు చేశారు . పరిశుభ్రమైన ఆహారం లేని కారణం , ప్రభుత్వ అనుమతి లేకపోవడంతో వాటిని నిషేధించినట్లు అధికార్లు వివరిస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







