వెలుగుల దీపావళి: దుబాయ్‌లో ఈవెంట్స్ సందడి
- November 05, 2018
దుబాయ్:దుబాయ్‌లో వెలుగుల దీపావళి కోసం ఏర్పాట్లు జోరందుకున్నాయి. దుబాయ్ క్రీక్ తొలిసారిగా ఎమిరేట్స్ అఫీషియల్ దివాలీ దియా లైటింగ్ సెర్మానీ జరగబోతోంది. నవంబర్ 7 రాత్రి 8.30 నిమిషాలకు ఈ ఈవెంట్ జరుగుతుంది. పెద్దయెత్తున ఆకాశంలో ఫైర్ వర్క్స్ జరగనున్నాయి. పది రోజులపాటు సాగే దీపావళి సెలబ్రేషన్స్‌ని దుబాయ్ ఫెస్టివల్స్ అండ్ రిటెయిల్ ఎస్టాబ్లిష్‌మెంట్, దుబాయ్ పోలీస్, ఇండియా కాన్సులేట్ జనరల్, మీరాస్ అల్ సీఫ్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. బాలీవుడ్ భాంగ్రా పెర్ఫామెన్స్‌లు, ఎల్‌ఇడి లైట్లకు సంబంధించి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్, సూపర్ కార్స్ డిస్‌ప్లే, మార్చింగ్ బ్యాండ్స్ పెర్ఫామెన్స్ - దుబాయ్ పోలీస్ ఇతర ప్రధాన ఆకర్షణలు. నవంబర్ 10న రికార్డ్ అటెంప్ట్‌ని అల్ సీఫ్ ధో డెక్‌లో చేస్తారు. నవంబర్ 1 నుంచి 10 వరకు ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు లైట్ అప్ దుబాయ్ కార్యక్రమం జరుగుతుంది. దుబాయ్ క్రీక్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దివాళీ మార్కెట్, అల్ సీఫ్.. ఇలా పలు ప్రాంతాల్లో ఈవెంట్స్ నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







