రోడ్డు ప్రమాదంలో 42 ఏళ్ళ మహిళ మృతి
- November 05, 2018
షార్జా:కుమార్తెను ట్రాలర్‌లో వేసుకుని వెళుతున్న ఓ మహిళను వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొంది. ఈ ఘటనలో మహిళ మృతి చెందగా, 16 నెలల చిన్నారి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. షార్జాలో ఈ ఘటన జరిగింది. ఉదయం 8 గంటల సమయంలో ఈ ఘటన జరగగా, సంఘటన గురించిన సమాచారం అందుకోగానే ఘటనా స్థలికి పోలీసులు చేరుకున్నారు. గాయపడ్డ చిన్నారిని, ఆమె తల్లిని వెంటనే అల్ కాసిమి ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాలతో ఆ మహిళ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. రోడ్ క్రాసింగ్ కోసం ప్రత్యేకంగా కేటాయించిన ప్రాంతంలో కాకుండా, వేరే ప్రాంతంలో రోడ్ క్రాస్ చేయడం ఈ ప్రమాదానికి కారణంగా పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనకు అతి వేగం కూడా కారణమని వారు చెబుతున్నారు. ఈ ఘటనకు కారకుడైన డ్రైవర్‌ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







