సైక్లిస్ట్‌పై దాడి, దోపిడీ
- November 05, 2018
షార్జా క్రిమినల్ కోర్టులో ఆసియాకి చెందిన ఓ వ్యక్తిపై దాడి, దొంగతనం అభియోగాలు నమోదయ్యాయి. నిందితుడు, ఓ సైక్లిస్ట్‌పై దాడి చేసి 10,000 దిర్హామ్‌లను దోచుకున్నట్లు అభియోగాల్లో పేర్కొన్నారు. షార్జాలోని సజా ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు వ్యక్తులతో కలిసి నిందితుడు ఈ దాడికి పాల్పడ్డాడు. సాయంత్రం 7 గంటల సమయంలో సజా ఇండస్ట్రియల్ ఏరియా ప్రాంతంలో తాను సైకిల్‌పై వెళుతుండగా, ముగ్గురు వ్యక్తులు తనను ఆపి, దారి చూపించమని అడిగారనీ, అంతలోనే వారు తనపై దాడికి దిగి, దోచుకున్నారని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కత్తితో బెదిరించి దాడి చేసినట్లు నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. అయితే న్యాయస్థానంలో నిందితులు మాత్రం తామెలాంటి దాడికి పాల్పడలేదని అంటున్నారు. కేసు విచారణ నవంబర్ 28వ తేదీకి వాయిదా పడింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







