వాట్సప్‌లో కొత్తగా వచ్చిన మార్పులు..
- November 06, 2018
మన రోజువారీ జీవితంలో వాట్సాప్ ఓ భాగమై పోయింది. చాటింగ్‌కు చాలా యాప్‌లు అందుబాటులో ఉన్నా వాట్సాప్‌కే క్రేజ్ ఎక్కువ. టెక్ట్స్ మెసేజ్‌లు, ఫొటోలను వాట్సాప్ ద్వారా సులభంగా పంపుకోవచ్చు. ఈ సౌలభ్యమే ఈ యాప్‌కు ఎక్కువ మంది ఆకర్షితులవడానికి ఓ కారణం.అందుకే వాట్సాప్ అనేక కొత్త మార్పులు ప్రవేశపెడుతోంది. వీటిలో కొన్ని చిన్న చిన్నవి కాగా మరి కొన్ని కీలకమైన మార్పులు. ఈ నేపథ్యంలో తాజాగా మరో చిన్న మార్పు తీసుకువచ్చింది.
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఫోన్లలో...
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఫోన్లలో వాట్సాప్ బేటా 2.18.325 వెర్షన్ వాడుతున్న వారికి ప్రస్తుతం ఇది వర్తిస్తుంది. ఇకపై ఒకరికంటే ఎక్కువ మందికి ఏదైనా మెసేజీ ఫార్వర్డ్ చేయాలనుకున్నప్పుడు అవి నేరుగా ఫార్వర్డ్ చేయడానికి ముందు వాట్సాప్ప మనకు ఒక ప్రివ్యూ చూపించబోతోంది. ఒకవేళ ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేయాలా లేదా అన్నది అప్పటికప్పుడు నిర్ణయించుకోవచ్చు, వద్దు అనుకుంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు.
ఫేక్ న్యూస్ విపరీతంగా సర్క్యులేట్ అవకుండా...
ఫేక్ న్యూస్ విపరీతంగా సర్క్యులేట్ అవకుండా అడ్డుకోవడం కోసం వాట్సాప్ కొద్ది నెలల నుండి గరిష్టంగా ఐదు మందికి మాత్రమే ఫార్వర్డ్ చేయగలిగే విధంగా పరిమితి విధించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా వాట్సప్‌ని ఆధారంగా చేసుకొని పని చేసే థర్డ్-పార్టీ యాప్స్ విషయంలో కూడా కఠినమైన నిబంధనలను వాట్సప్ విధించడం జరిగింది.
ఇతర అప్లికేషన్లు తమ టైటిల్‌లో వాట్సప్ అనే పదాన్ని కలిగి ఉండకూడదు...
దీనిలో భాగంగా ఇకపై ఇతర అప్లికేషన్లు తమ టైటిల్‌లో వాట్సప్ అనే పదాన్ని కలిగి ఉండకూడదు. వాట్సప్ అర్థం ధ్వనించే విధంగా Whatsap, Watsapp, WutsApp, wazapp, watapp, wutzap, watzapp, ZapZap వంటి ఇతర పేర్లను కూడా ఎట్టిపరిస్థితుల్లోనూ కలిగి ఉండకూడదు.
వాట్సాప్ లోగోని, కంపెనీ పేరులను ఇతర యాప్స్ కలిగి ఉండకూడదు...
అలాగే వాట్సాప్ లోగోని, కంపెనీ పేరులను ఇతర యాప్స్ కలిగి ఉండకూడదు. వాట్సప్ టెలీఫోన్ లోగోని వినియోగించకూడదు. వాట్సప్ లోగోని ఎడిట్, మాడిఫై, రొటేషన్, కలర్ మార్చటం లాంటి పనులు చేయకూడదు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







