దుబాయ్:గ్లోబల్ ఫ్యూచర్ కౌన్సిల్ సమావేశం లో పాల్గొన్న నారా లోకేష్
- November 11, 2018
దుబాయ్:దుబాయ్ పర్యటనలో మంత్రి నారా లోకేష్ బిజీ బిజీగా ఉన్నారు. పర్యటనలో భాగంగా గ్లోబల్ ఫ్యూచర్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న లోకేష్.. ఏపీలో అనుసరిస్తున్న పరిపాలనా విధానాలను వివరించారు. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులో తెచ్చామన్నారు. కాల్ సెంటర్ ద్వారా ప్రజల సంతోష సూచిక తెలుసుకుంటున్నామని చెప్పారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్న తీరును తెలుసుకుంటున్నామని వివరించారు. అధునాతన టెక్నాలజీ అమలు చెయ్యడంలో ముందున్నామన్నారు. వివిధ శాఖల పనితీరు రియల్ టైంలో తెలుసుకునేలా డ్యాష్ బోర్ట్ ఏర్పాటు చేశామన్నారు. సర్టిఫికెట్ లెస్ గవర్నెన్స్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







