నయన్ బర్త్ డే స్పెషల్: 'సైరా' మోషన్ టీజర్ రిలీజ్
- November 18, 2018
మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న సినిమా 'సైరా నరసింహారెడ్డి'. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. నేడు నయనతార పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రబృందం విషెస్ చెబుతూ.. నయన్ ఫస్ట్‌లుక్‌కు సంబంధించిన మోషన్ టీజర్‌ను విడుదల చేసింది.
'వెరీ వెరీ హ్యాపీ బర్త్ డే నయనతార. ఈ సందర్భంగా 'సైరా నరసింహారెడ్డి' నుంచి సిద్ధమ్మ అద్భుతమైన లుక్' అని ట్వీట్ చేసింది చిత్రబృందం. ఈ చిత్రంలో నయన్ పాత్ర పేరు సిద్ధమ్మ. ఈ సినిమాలో చిరు డ్యుయెల్ రోల్ పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మరణానంతరం ఆయన స్ఫూర్తితో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటాన్ని కొనసాగిస్తాడు. ఈ పాత్రను కూడా చిరంజీవితోనే చేయించనున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







