ఇన్‌స్టాకీ కష్టాలు.. ఫేక్ లైక్స్‌కి..
- November 20, 2018
సోషల్ మీడియాలో తక్కువ మంది వాడేది.. ఎక్కువగా సెలబ్రెటీలు వినియోగించే ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్. అయితే దీనిక్కూడ ఫేస్‌బుక్‌లానే నకిలీ లైక్స్, నకిలీ ఫాలోయర్లు ఎక్కువైపోయారు. ఇన్‌స్టాకి ఉన్న ఇమేజ్ తగ్గిపోతుంది. దీంతో ఇన్‌స్టా యాజమాన్యం మేల్కొని యూజర్లలో పలుచన కాకూడదనే ప్రయత్నాలు ప్రారంభించింది.
యూజర్లు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదని ప్రక్షాళన చర్యలకు ఉపక్రమించింది. ఈ రోజునుంచే నకిలీ లైక్స్‌ని, నకిలీ ఫాలోయర్స్‌ని ఏరివేసే పనిలో పడినట్లు యాజమాన్యం వెల్లడించింది. ఇందుకోసం ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీతో నడిచే స్పెషల్ లెర్నింగ్ టూల్స్ తయారు చేసుకుంది. దీనిలో భాగంగానే యూజర్లకు ‘ఇన్-యాప్’ మెసేజెస్ పంపనుంది. ఈ దెబ్బతో థర్డ్ పార్టీల ద్వారా ఫేక్ లైక్స్, ఫేక్ ఫాలోయర్లను ఏర్పాటు చేసుకునే వారందరికి పెద్ద షాక్ తగిలినట్టవుతుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







