15 సెకెండ్స్లోనే యూఏఈ ఎంట్రీ పర్మిట్
- November 21, 2018
యూ.ఏ.ఈ:ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా కేవలం 15 సెకెండ్లలోనే ఎంట్రీ పర్మిట్స్ కోసం అప్లయ్ చేసుకునే అవకాశం కలుగుతుందని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ ఎఫైర్స్ (జిడిఆర్ఎఫ్ఎ) వెల్లడించింది. కొత్త స్మార్ట్ సిస్టమ్ ద్వారా 5 మిలియన్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ టైమ్‌లో పూర్తి చేయగలదని అధికారులు వివరించారు. జిడిఆర్ఎఫ్ఎ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మర్రి మాట్లాడుతూ, అప్లికెంట్స్ అథారిటీకి చెందిన స్మార్ట్ యాప్ లేదా వెబ్ సైట్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. ఈ సిస్టమ్ వెంటనే డాక్యుమెంట్స్‌ని స్కాన్ చేసి, అక్కడికక్కడే వీసాల్ని మంజూరు చేస్తుంది. ఏడాదిగా ఈ సిస్టమ్‌ని తాము పరీక్షిస్తున్నామనీ, పూర్తిస్థాయి యాక్యురసీతో ఈ సిస్టమ్ పనిచేసిందని అధికారులు వివరించారు. మెడికల్ సర్టిఫికెట్ బేస్డ్ రికార్డ్స్‌ని చెక్ చేయడానికి గతంలో 4 నుంచి 6 గంటల సమయం పట్టేదనీ, అది ఇప్పుడు కేవలం 15 సెకెండ్లలో పూర్తయిపోతుందని కల్నల్ డాక్టర్ ఒమర్ అలి సయీద్ అల్ షామ్సి చెప్పారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







