"తోట రాముడు"గా బాలయ్య

- November 21, 2018 , by Maagulf

ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా, నిర్మాతగా ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ బయోపిక్ ను రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. ఇక మొదటి భాగమైన ఎన్టీఆర్ 'కథానాయకుడు' చిత్రంలో ఎన్టీఆర్ నటించిన ముఖ్యమైన సినిమాల్లోని పాత్రలను, సన్నివేశాలను చూపించబోతున్నారు. ఎన్టీ రామారావు కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో 'పాతాళ భైరవి' ముందు వరుసలో కనిపిస్తుంది. ఈ సినిమాలో ఎన్టీ రామారావు 'తోట రాముడు' పాత్రలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు.

ఎన్టీఆర్ బయోపిక్ లో బాలకృష్ణ కూడా 'తోట రాముడు'గా తెరపై సందడి చేయనున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ లో 'పాతాళ భైరవి' సినిమాకి సంబంధించిన సన్నివేశాలు కూడా వున్నాయి. దర్శకుడు క్రిష్ ప్రస్తుతం ఆ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు. 'తోట రాముడు'గా బాలకృష్ణ అదరగొడుతున్నాడని సమాచారం. ఈ పాత్రకి సంబంధించిన పోస్టర్ ను కూడా క్రిష్ త్వరలో విడుదల చేసే అవకాశం వుంది. 'కథానాయకుడు' జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com