బ్రూనైలో క్రిస్మస్ వేడుకలపై సుల్తాన్ కఠిన ఆంక్షలు
- December 22, 2015
బ్రూనై దేశంలో క్రిస్మస్ వేడుకలపై బ్రూనై సుల్తాన్ హసనల్ బోల్కియా కఠిన ఆంక్షలు విధించారు. ఆంక్షలు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలతో పాటు ఐదేళ్ల వరకు జైలుశిక్ష విధించే చట్టాన్ని తీసుకొచ్చారు. క్రైస్తవులు బహిరంగంగా క్రిస్మస్ వేడుకలను జరుపుకోరాదని, క్రిస్మస్ చెట్లను ఏర్పాటుచేయడం, మతపరమైన పాటలు పాడడం, క్రిస్మస్ గ్రీటింగ్స్ చెప్పుకోవడం లాంటి చర్యలన్నింటినీ నిషేధిస్తున్నట్లు బ్రూనై మత విశ్వాసాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ముస్లింలు ఎవరూ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనరాదని, అలా చేస్తే ఐదేళ్ల వరకు జైలుశిక్ష విధిస్తామని ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం ప్రకటించింది. క్రిస్మస్ రోజు సెలవుదినం కాబట్టి, క్రైస్తవులు తమ కమ్యూనిటీ మధ్యనే వేడుకలు జరుపుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







