షార్జా ఖలీద్ పోర్ట్‌లో ఇరానియన్ షిప్ సీజ్
- December 23, 2015
యాంటీ నార్కోటిక్స్ ఫెడరల్ డైరెక్టరేట్ జనరల్ మరియు యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్‌మెంట్ షార్జా పోలీస్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరానియన్ షిప్ సీజ్ అయ్యింది. ఈ షిప్ ద్వారా అక్రమంగా మనుషుల్నీ, నిషేదిత మాదక ద్రవ్యాల్నీ రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. షార్జాలోని ఖాలిద్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ షిప్‌ని సీజ్ చేశారు పోలీసు అధికారులు. 11.5 కిలోల హర్షిస్ మరియు 142,725 నార్కోటిక్ పిల్స్‌ని షిప్‌లో రహస్యంగా దాచి ఉంచగా, వాటిని అధికారులు గుర్తించి సీజ్ చేశారు. ఈ దాడుల్లో 10 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిషేధిత మాదక ద్రవ్యాల్ని కలిగి ఉండడం, సేవించడం చట్ట ప్రకారం నేరమనీ, మనుషుల అక్రమ రవాణా సైతం కఠినంగా శిక్షింపదగ్గ నేరమని ఇలాంటి అసాంఘిక చర్యల పట్ల పౌరులకు ఎలాంటి సమాచారం అందినా, ప్రభుత్వానికి తెలపాలని అధికారిక వర్గాలు సూచించాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







