హ్యంగ్ఓవర్ కి చిట్కా

- May 10, 2015 , by Maagulf
హ్యంగ్ఓవర్ కి చిట్కా

అలసటతోకావచ్చు.. ఆనందానికి కావచ్చు.. చిరాకుతో కావచ్చు.. విరక్తితో కావచ్చు.. ఏ కారంణంతో రాత్రంతా పీకలదాకా తాగి పడుకున్నా.. దానివల్ల పొద్దున్నే తలెత్తే హ్యాంగోవర్ నుంచి తొందరగా బయటపడాలంటే మాత్రం కొన్ని ఆహార నియమనిబంధనలు పాటించాలని నిపుణులు చెప్తున్నారు. లేదంటే వికారంగా ఉండి జీర్ణ వ్యవస్థ కుదురుకోక ఓ వారం రోజులపాటు అలసట తలెత్తి.. చిరాకుతో చిర్రెత్తిపోయి.. ఏకాగ్రత మొత్తం పాడై పోతుందని వారు చెప్తున్నారు. హ్యాంగోవర్ నుంచి బయటపడేందుకు ఏంచేయాలి.. బెడ్ పైనే ఉండి విశ్రాంతి తీసుకోవాలి ఆరెంజ్ జ్యూస్ జీర్ణాశయానికి ఆ సమయంలో చాలా మంచిది. ఆ రోజు సాధారణంగా కేలరీలు ఎక్కువ అవసరం అని చాలామంది సాండ్ విచ్ తీసుకుంటారు.. కానీ అలాంటి వాటికి బదులు గ్రుడ్లు తినాలి. కాఫీ హ్యాంగోవర్ ను ఎక్కువ చేస్తుంది.. అందుకే దీనికి బదులు ఎక్కువ మొత్తంలో నీళ్లుగాని, హెర్బల్ టీగానీ తాగాలి. గ్రే ఫుడ్ తీసుకోవాలి. మాంసం కొంచెం తినొచ్చుగానీ.. పూర్తి స్థాయిలో తినకూడదు. హ్యాంగోవర్ పోవడానికి చాలామంది మరింత ఆల్కహాల్ తాగుతారు. కానీ దీనివల్ల డీహైడ్రేషన్ జరుగుతుంది. అది మంచిది కాదు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com