ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రంలో అయుత మహా చండీయాగం
- December 23, 2015
మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో అయుత మహా చండీయాగం బుధవారం ఉదయం ప్రారంభమైంది. నిర్ణయించిన ముహుర్తమైన 8.30నిమిషాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు యాగశాల ప్రవేశం చేశారు. రుత్వికులు, బ్రాహ్మణులు, నిర్వాహకులు సీఎంకు ఘనస్వాగతం పలికారు. యాగశాలకు వచ్చిన ఆయనకు వేద మంత్రోచ్ఛరణ, మంగళవాయిద్యాలు, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రుత్వికులతో కలిసి ముఖ్యమంత్రి దంపతులు యాగశాల ప్రదక్షిణ చేశారు. యాగస్థలికి చేరుకున్న తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ దంపతులకు సీఎం దంపతులు స్వాగతం పలికారు. గురు ప్రార్థనతో చండీమాత విగ్రహం ముందు మొదటిరోజు కార్యక్రమం ప్రారంభమైంది.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







