క్రైస్తవులకు కానుకగా..నవ్యాంధ్రలో క్రైస్తవ భవన్
- December 23, 2015
నవ్యాంధ్రలో క్రైస్తవ భవన్ గుంటూరు సమీపంలోని అడవితక్కెళ్లపాడులో ఏర్పాటు కానుంది. మంత్రి రావెల కిషోర్‌బాబు చొరవతో ఈ భవనం నిర్మాణం జరగనుంది. ఇందులోనే క్రైస్తవ మైనార్టీ కార్పొరేషన్ రాష్ట్ర కార్యాలయం కూడా ఏర్పాటవుతుంది. క్రైస్తవులకు శిక్షణ కార్యక్రమాలు, సదస్సులు, సమావేశాలు జరుపుకోవడానికి భవిష్యత్తులో ఇదొక కీలకమైన వేదిక కానుంది. అలానే జెరూసలేం యాత్రకు వెళ్లే క్రైస్తవులు బస చేసేందుకు కూడా ఈ భవనం ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. ఈ భవనానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయనున్నారు. క్రైస్తవ భవన్ నిర్మాణానికి బడ్జెట్ నుంచి రూ. 10 కోట్లను విడుదల చేయించారు. ఈ భవనం కోసం ఎన్నాళ్లుగానో క్రైస్తవులు ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు వారి నిరీక్షణ మంగళవారం సాకారం కాబోతోంది. శంకుస్థాపన అనంతరం ఇక్కడే సెమీక్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి క్రైస్తవ సంఘాల మతపెద్దలు గాలిబాలి, అబ్రహం, శామ్యూల్, గోవాడ దైవ ఆశీర్వాదం, వెస్లీ, స్టీఫెన బల్గర్, జానవెస్లీ, అంతర్జాతీయ గాయకులు పాల్గొంటారు. అలానే వేడుకలు అనంతరం సంఘ సేవకులను ఘనంగా సత్కరిస్తారు. మతపెద్దలకు గౌరవ విందును కూడా ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !







