రష్యా వైమానిక దాడుల్లో సిరియాలో 200 మంది అంతం
- December 23, 2015
రష్యా వైమానిక దాడుల్లో సిరియాలో 200 మంది సామాన్య పౌరులు మరణించారని వెలుగు చూసింది. రష్యా జరుపుతున్న క్షిపణి దాడుల్లో అమాయకులు బలి అవుతున్నారని ఓ స్వచ్చంద సంస్థ వెల్లడించింది. రష్యా తమ లక్ష్యాన్ని పక్కదోవ పట్టిస్తున్నదని మానవ హక్కుల సంస్థ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ తన నివేదికలో తెలిపింది. సిరియాలోని అలెప్పో, ఇడ్లిబ్, లటాకియా, హమా తదితర ప్రాంతాల్లో రష్యా దాడులు జరిపిందని ఆ సంస్థ వివరించింది. నవంబర్ 29వ తేదిన ఇడ్లిబ్ ప్రాంతంలో రద్దీగా ఉన్న పబ్లిక్ మార్కెట్ లో రష్యా క్షిపణి దాడి చేసిందని, అక్కడే 49 మంది పౌరులు దుర్మరణం చెందారని నివేదిక పేర్కొంది. సిరియాలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదుల పై దాడులు చెయ్యాలని సిరియా నేత అల్ బషర్ రష్యాకు మనవి చేశారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై పోరాటం చేస్తున్నామని రష్యా సెప్టెంబర్ 30వ తేది ప్రకటించింది. తరువాత సిరియాలో దాడులు మొదలు పెట్టింది. అయితే ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను అంతం చెయ్యకుండా అల్ బషర్ వ్యతిరేకులను రష్యా టార్గెట్ చేసుకుని దాడులు చేస్తున్నదని ఆరోపణలు ఉన్నాయి. యుద్ద సమాచారన్ని పూర్తిగా తెలుసుకోకుండా అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ నివేదిక విడుదల చేసి కావాలనే అసత్యాలను ప్రచారం చేస్తున్నదని రష్యా మండిపడింది. తామూ పూర్తి సమాచారం తెలుసుకుని నివేదిక విడుదల చేశామని అమ్నెస్టీ సమర్థించుకుంది.
తాజా వార్తలు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!







