పంచె కట్టులో బాలకృష్ణ..
- December 01, 2018
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మహానటుడు స్వర్గీయ ఎన్టీరామారావు జీవిత నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి క్రిష్ డైరెక్ట్ చేస్తుండగా , బాలయ్య స్వయంగా నిర్మిస్తుండగా సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 2019 జనవరి 9న 'యన్.టి.ఆర్-కథానాయకుడు', జనవరి 24న 'యన్.టి.ఆర్- మహానాయకుడు'గా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటి వరకు చిత్రానికి సంబంధించి పలు పోస్టర్స్ విడుదల కాగా, తాజాగా మరో అదిరిపోయే స్టిల్ ను విడుదల చేసి సినిమాపై ఇంకాస్త అంచనాలు పెంచారు. రేపు ఉదయం 7.42ని.లకి ఎన్టీఆర్- కథానాయకుడు లో కథానాయక అంటూ సాగే సాంగ్‌ని విడుదల చేస్తున్నట్టు ఈ పోస్టర్ ద్వారా తెలియజేసారు. ఈ పోస్టర్‌లో బాలయ్య.. ఎన్టీఆర్ గెటప్‌లో పంచె కట్టుకొని కనిపిస్తున్నాడు. అసెంబ్లీ ముందు వీరావేశంతో నడుస్తున్నట్టు ఉన్న ఈ పోస్టర్ అభిమానులని విపరీతంగా ఆకట్టుకుంటుంది.
ఈ మూవీ ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో విద్యా బాలన్ నటించగా, చంద్రబాబు పాత్రలో రానా ఇతర పాత్రల్లో పలువురు సీనియర్ స్టార్స్ నటిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







