బుల్లెట్ ప్రూఫ్ కాఫీ..
- December 01, 2018
ఉదయం లేవగానే ఓ కప్పు వేడి వేడి కాఫీ లేదా చాయ్ ఆస్వాదిస్తూ తాగితే ఆ కిక్కే వేరప్పా. ఆరోజు పనులు చేయడానికి ఉత్సాహం వస్తుంది. అది కాఫీతోనే మొదలవుతుంది. మరి కొంత మందికి కాఫీ తాగితేనే కడుపులోని గడబిడ నుంచి రిలీఫ్ వస్తుంది.
ఓ పక్క న్యూస్ పేపర్లోని వార్తలు చదువుతూ, మరో పక్క కాఫీని సిప్ చేస్తుంటారు మరికొందరు. ఈ రెండింటిలో ఏ ఒక్కటి లేకపోయినా ఏదో వెలితిగా అనిపిస్తుంది. రోజుకి ఒకటీ, రెండు కప్పుల కాఫీ ఆరోగ్యానికి మంచిదని రీసెర్చ్‌లు కూడా తేల్చేశాయి.
గుండెజబ్బుల నుంచి, టైప్ 2 డయాబెటిస్ లాంటీ వ్యాధుల నుంచి కొంత తప్పిస్తుందని వైద్యులు వివరిస్తుంటారు. అన్నిటికీ మించి కాఫీ తాగితే మానసిక ఒత్తిడినుంచి ఉపశమనం కలుగుతుందని కొందరంటారు. ఇక కొందరికి కాఫీ తాగితే కడుపు నొప్పి వస్తుంటుంది. ఇలా మంచి చెడూ రెండు ఉంటాయి.
ఎంచుకునే పౌడర్‌ని బట్టి కూడా ఆరోగ్యంపై కొంత వరకు ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయంటున్నారు పరిశోధకులు. ఏ ఒక్కరి శరీరతత్వం ఒకలా ఉండదు. కాఫీలో కెఫైన్ ఉంటుంది. కొంతమంది రోజుకి 4,5 కప్పుల కాఫీ తాగినా ఏమీ అనిపించదు. కొందరికి ఓ కప్పు కాఫీ తాగితే చాలు.
ఆరోజంతా తెలియని ఉత్సాహం. అంతకు మించి అస్సలు తాగలేరు. బలవంతంగా తాగితే ఇబ్బంది పడుతుంటారు. అందుకే రెండో కప్పు జోలికి వెళ్లరు. ఉదయాన్నే పరగడుపున కెఫైన్ తీసుకుంటే గుండె వేగం పెరగొచ్చు. అలజడిగా అనిపించవచ్చు. ఇంసోమ్నియా లాంటి అరుదైన వ్యాధికి గురయ్యే అవకాశం కూడా లేకపోలేదు.
అయితే ఇదంతా కెఫైన్ అధికంగా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ దాపురిస్తాయంటున్నారు అధ్యయనకారులు. 16 ఔన్సుల స్టార్ బక్స్ కాఫీలో 330 ఎంజీ కెఫైన్ ఉంటే రెండు షాట్స్ ఎస్‌ప్రెస్సో కాఫీలో 150 ఎంజీ కెఫైన్ మాత్రమే ఉంటుందట. కెఫెన్‌లోని యాసిడ్ కంటెంట్ కారణంగా కొందరికి కడుపులో మంట వస్తుంటుంది.
ఇటువంటి వారు అసిడిక్ కంటెంట్ తక్కువగా ఉండే కాఫీని తీసుకోవాలి. వీరికి ఎస్ ప్రెస్సో, ఫ్రెంచ్ రోస్ట్ లాంటివి ఇబ్బంది కలిగించకుండా ఉంటాయి. చెక్కెర, వెన్న, MCT ఆయిల్ లాంటివి కలిపి తయారు చేసిన కాఫీ శరీరం మీద ఏదో విధంగా చెడు ప్రభావం చూపించే ప్రమాదం ఉంది. దీన్నే బుల్లెట్ ఫ్రూఫ్ కాఫీ అంటారు.
దీంతో మెటబాలిజం, మెంటల్ క్లారిటీ లాంటివి పెరుగుతాయని తెలిసినా, అజీర్తికి దారితీసే ప్రమాదం కూడా లేకపోలేదు. సాధారణంగా కాఫీలో ఎక్కువ చెక్కెర వేస్తుంటారు. దీంతో శరీర బరువు పెరగడం, మధుమేహం బారిన పడడం లాంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అందుకే ఇష్టం కదా అని ఎక్కువ తాగడం.. మంచిది కాదని మానేయడం లాంటివి చేయక్కర్లేదని చెబుతుంటారు డాక్టర్లు. ఏదైనా లిమిట్‌లో ఉంటే ఏ ఇబ్బందీ ఉండదని వివరిస్తుంటారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!