పోస్ట్‌ పార్సెల్‌లో సెక్స్‌ టూల్స్‌

- December 05, 2018 , by Maagulf
పోస్ట్‌ పార్సెల్‌లో సెక్స్‌ టూల్స్‌

కువైట్‌ సిటీ: హతీమ్‌ పోస్ట్‌ ఆఫీస్‌లోని ఓ పార్సెల్‌ టూల్‌లో సెక్స్‌ టూల్స్‌ దర్శనమిచ్చాయి. ఓ జిసిసి దేశం నుంచి అరబ్‌ వలసదారుడికి ఈ పార్సెల్‌ వచ్చినట్లుగా తెలుస్తోంది. పార్సెల్‌ అందుకోవాల్సిన వ్యక్తిని ప్రస్తుతం విచారిస్తున్నారు. పార్సెల్‌లో ఇమ్మోరల్‌ సెక్స్‌ మెటీరియల్‌ వున్నందున, సంబంధిత అధికారిక వర్గాలు వాటిని సీజ్‌ చేసుకుని, కేసుని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరో ఘటనలో డైరెక్టర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ కస్టమ్స్‌ - జనరల్‌ కస్టమ్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ మెషాన్‌ అల్‌ సయీది మాట్లాడుతూ, అబ్దాలి బోర్డర్‌ కస్టమ్స్‌ ఆఫీసర్స్‌, అరబ్‌ వలసదారుడు 1.6 కిలోగ్రాముల షాబుని స్మగుల్‌ చేస్తుండగా పట్టుకున్నట్లు చెప్పారు. ఇరాక్‌ నుంచి ఈ షాబు, దేశంలోకి స్మగుల్‌ చేసేందుకు ప్రయత్నం జరిగిందని అధికారులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com