రెక్లెస్ డ్రైవింగ్: 36 మంది అరెస్ట్
- December 23, 2015
షార్జా పోలీసులు 34 వాహనాలను సీజ్ చేశారు. వాహనాల్ని వేగంగా, రెక్లెస్గా నడుపుతుండడాన్ని గుర్తించిన అధికారులు వాటిని సీజ్ చేసి, కేసులు నమోదు చేశారు. ట్రాఫిక్ మరియు పెట్రోల్ డిపార్ట్మెంట్ యాక్టింగ్ డైరెక్టర్ కల్నల్ అహ్మద్ బిన్ దర్విష్ మాట్లాడుతూ, రోడ్లపై వాహనాలతో స్టంట్లు చేస్తున్నారనీ, ఇది నిబంధనల ఉల్లంఘన అని చెప్పారు. స్వాధీనం చేసుకున్న వాహనాల్లో ఇంజన్లను మార్చడం, విపరీతమైన శబ్దం వచ్చేలా సాంకేతికంగా మార్పులు చేయడాన్ని గుర్తించినట్లు చెప్పారాయన. రోడ్లపై స్టంట్స్ చేయడం ద్వారా వాహనాలు నడిపేవారికే కాకుండా, రోడ్లపై వెళ్ళే ఇతరులకూ ప్రమాదకరమని ఆయన అన్నారు. విపరీతమైన శబ్దంతో వాహనాలు నడపడం వల్ల రోడ్లకు సమీపంలో నివసించేవారికి తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నట్లు చెప్పిన పోలీసు ఉన్నతాధికారులు, ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







