ఖతారీల కిడ్నాప్‌ని ఖండించిన జిసిసి
- December 23, 2015
గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ మెంబర్ స్టేట్స్, ఇరాక్‌లో ఖార్ పౌరుల కిడ్నాప్‌ని తీవ్రంగా ఖండించాయి. పిరికిపంద చర్యగా ఈ కిడ్నాప్‌ని అభివర్ణించాయి జిసిసి సభ్య దేశాలు. జిసిసి జనరల్ సెక్రెటరీ విడుదల చేసిన ఓ ప్రకటనలో, కిడ్నాప్ అయిన ఖతార్ పౌరులను క్షేమంగా విడిపించేందుకు ఇరాక్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఖతార్‌కి జిసిసి సభ్యదేశాలు మద్దతుగా నిలుస్తాయని ప్రకటనలో పేర్కొన్నారు. ఖతార్, ఇరాక్ మధ్య ఈ సమస్య పరిష్కారం కోసం జిసిసి సభ్య దేశాలు చొరవ చూపేందుకు సిద్ధంగా ఉన్నాయనీ చెప్పారు. ఇరాక్ ప్రభుత్వం తక్షణం, ఖతార్ పౌరులు క్షేమంగా విడుదల చేసేందుకు ప్రయత్నించాలనీ, మానవ హక్కుల్ని హరించే ఎలాంటి తీవ్రవాద చర్యలనూ ఉపేక్షించరాదని కోరారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







